రుచుల పండుగ రంజాన్‌.. 10 వెరైటీలు మీకోసం!

Ramadan 2022 10 Special Recipes With Ingredients In Telugu - Sakshi

రంజాన్‌ మాసంలో సూర్యోదయానికి  ముందు  సుహార్‌, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్‌ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్‌ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్‌ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్‌ పల్టి హరినాథ్‌ వివరిస్తున్నారు.

సాధారణంగా రంజాన్‌ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్‌ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ  విందుల్లో  ఆరగించే టాప్‌ 10 వంటకాల్లో...


హలీమ్‌ – ఇఫ్తార్‌ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్‌ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్‌ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది.

కెబాబ్స్‌:మటన్‌  లేదంటే చికెన్‌ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం  ఫ్రై  చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. 
చికెన్‌  షావార్మా – అత్యంత ప్రాచుర్యం  పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్‌ ఇది. సన్నగా కోసిన చికెన్‌ లేదా మటన్‌ ముక్కలను బ్రెడ్‌ లోపల కూరగాయలు, సాస్‌ కలిపి ఆరగిస్తారు.  
కీమా సమోసా – గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి.

మటన్‌ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్‌. బోన్‌  మటన్‌ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
దమ్‌ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్‌ లేదా చికెన్‌, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది.
ఫలాఫెల్‌ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్‌ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్‌ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్‌ లేదా పట్టీ ఫలాఫెల్‌.  వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్‌ సమయంలో సర్వ్‌ చేస్తారు. .
షీర్‌ ఖుర్మా –  మొఘలాయ్‌ వంటకం ఇది. షీర్‌ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్‌ఖుర్మా  దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. 
అఫ్లాటూన్‌–  ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్‌ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్‌  వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్‌ ఇది.
రూ అఫ్జా – రంజాన్‌ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్‌ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్‌ ఎఫెక్ట్‌ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు.

ఐకమత్యం పెంచే రుచులు...
ఇది నిజంగా జష్న్‌–ఏ–రంజాన్‌. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్‌ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్‌ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. 
–మితేష్‌ లోహియా, డైరెక్టర్, సేల్స్‌–మార్కెటింగ్, గోల్డ్‌ డ్రాప్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top