వైద్యం అందక.. గర్భంలోనే శిశువు మృతి  | Pregnant Woman Was Injured Due To Rain In Mahabubabad District | Sakshi
Sakshi News home page

వైద్యం అందక.. గర్భంలోనే శిశువు మృతి 

Jul 12 2022 12:42 AM | Updated on Jul 12 2022 2:59 PM

Pregnant Woman Was Injured Due To Rain In Mahabubabad District - Sakshi

ట్రాక్టర్‌లో ఆస్పత్రికి వెళ్తున్న గర్భిణి  

కొత్తగూడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గర్భిణి మహిళ అవస్థపడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మొర్లి సరిత 6 నెలల గర్భవతి. ఆమెకు సరిగా రక్తం లేకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు రక్తం ఎక్కించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తీవ్ర కడుపునొప్పి వచ్చింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు పొంగి పొర్లుతోంది.

రాత్రి సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. సోమవారం ఉదయం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో వాగు దాటించి నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్‌ చేసిన వైద్యులు సమయానికి వైద్యం అందకపోవడం వల్ల గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు గుర్తించి అబార్షన్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement