ములుగు జిల్లాలో పులి చర్మం స్వాధీనం 

Police Arrest Two smugglers And Seized Tiger Skin At Mulugu - Sakshi

ఏటూరునాగారం/ములుగు: పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి పెద్దపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ గురువారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులి చర్మం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పులి చర్మంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా.. వాజేడు మండల కేంద్రానికి చెందిన తిరుమలేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా చండూరు గ్రామానికి చెందిన సత్యం అని తేలింది. ఇన్‌చార్జి ఎఫ్‌డీఓ శ్రీగోపాల్‌రావు, ఇతర అధికారులు పులి చర్మాన్ని పరీక్షించి.. నిజమైనదేనని నిర్ధారించారు. కాగా, పులి చర్మాన్ని వరంగల్‌లోని ఓ మహిళా కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి వారు ముల్లకట్ట బ్రిడ్జి వద్దకు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top