
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్) పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్ నమోదు గడువు ను పొడిగించింది. ముందుగా ఈనెల 11 వరకు దరఖాస్తులకు సమయం ఉండగా, ఇప్పుడు ఈనెల 14 (సాయంత్రం 5 గంటల దాకా) వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
కేవలం నీట్–పీజీ– 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవా లని సూచించింది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్ ఠీఠీఠీ.జుnటuజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీnలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది.