ఒకే వ్యక్తికి రెండు కేన్సర్లు.. రోబోటిక్‌ సర్జరీతో ఊరట 

A Person Of Two Cancers Relief With Two Robotic Surgeries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ కేన్సర్‌ వచ్చి పూర్తిగా తగ్గకుండానే మరో కేన్సర్‌ వచ్చిన వ్యక్తికి రోబోటిక్‌ సర్జరీ ద్వారా  సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు ఉపశమనం అందించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  కిమ్స్‌ ఆసుపత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్టు, రోబోటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మధు దేవరశెట్టి మాట్లాడుతూ సర్జరీ పూర్వాపరాలు తెలిపారు. ‘ఫార్మారంగంలో పనిచేసే 36 ఏళ్ల నగరవాసి ఎక్యూట్‌ ప్రోమైలోసిటిక్‌ లుకేమియా (ఏపీఎంఎల్‌).. అనే రక్తకేన్సర్‌కు  కీమోథెరపీ తీసుకుంటూనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌కి కూడా గురవడంతో రెండో కేన్సర్‌ చికిత్స కోసం తమ ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు.

సమస్య తీవ్రత దృష్ట్యా అతడికి రోబోటిక్‌ సర్జరీ చేయాలని నిర్ణయించి, కేవలం మూడున్నర గంటల కన్సోల్‌ టైంలోనే సర్జరీ పూర్తి చేశామన్నారు. సర్జరీ తర్వాత ఒక్క రోజు మాత్రమే ఐసియూలో ఉంచి,  ఐదోరోజున డిశ్చార్జి చేశామన్నారు. మన దేశంలో అత్యంత వేగవంతంగా జరిగిన రోబోటిక్‌ సర్జరీల్లో ఇదొకటని, రోగి చాలా త్వరగా, చాలా బాగా కోలుకున్నాడన్నారు. ఈ రోబోటిక్‌ సర్జరీలో కిమ్స్‌ ఆస్పత్రికి చెందిన సర్జికల్‌ ఆంకాలజిస్టులు డాక్టర్‌ వెంకటేశ్, డాక్టర్‌ మాధవితో పాటు సిస్టర్‌ స్వప్న పాల్గొన్నారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top