కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతి: బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత

Parents Died Due To The Coronavirus - Sakshi

వారంరోజుల్లో తల్లిదండ్రులను  బలి తీసుకున్న కరోనా 

దివ్యాంగురాలైన అక్క, నానమ్మల బాధ్యతలు మోయాల్సిన దైన్యం 

నిర్మల్‌ జిల్లాలో కరోనా తెచ్చిన ఉపద్రవం

మంచం పట్టిన భర్త.. దివ్యాంగురాలైన కూతురు.. వయసు పైబడిన అత్త.. అందరి భారం ఆమెపైనే.. తన రెక్కల కష్టంపై అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెను విధి చిన్నచూపు చూసిందేమో.. కరోనా సోకింది. మంచంలోనే మనోవేదనకు గురైన భర్తనూ ఆ మహమ్మారి అంటుకుంది. కరోనాతో మృత్యువాతపడ్డాడు. భర్త లేడన్న విషయం తెలిసిన ఇల్లాలు ఆస్పత్రి నుంచి కాటికి చేరింది. అమ్మానాన్న మరణంతో గూడు చెదిరిన పక్షుల్లా పిల్లలు, వృద్ధురాలు విలవిల్లాడుతున్నారు. అక్కను, నానమ్మను చూసుకోవాల్సిన బరువైన బాధ్యత బడికెళ్లే చిన్నారిపై పడింది. 

సారంగపూర్‌ (నిర్మల్‌): నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామానికి చెందిన ఎల్లుల రాములు (55), నర్సవ్వ (42) దంపతులకు ఇద్దరు సంతానం. కూతుళ్లు లత (28), సమిత (13) ఉన్నారు. లతకు పుట్టుకతోనే వెన్నెముక లోపంతో నడవలేని స్థితి. పుట్టు మూగ, మానసిక లోపంతో జన్మించింది. తన పనులు తాను చేసుకోలేని లతను తల్లి దగ్గరుండి చూసుకునేది. సమిత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రాములు బీడీ కంపెనీలో ప్యాకింగ్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

నర్సవ్వ బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది. ఎనిమిదేళ్ల క్రితం రాములుకు వెన్నెముకలో సమస్య రావడంతో ఆపరేషన్‌ చేయించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ భారం నర్సవ్వపై పడింది. మామ చనిపోవడంతో అత్త బాధ్యతలు సైతం నర్సవ్వ భుజాన వేసుకుంది. మంచం పట్టిన భర్తకు, దివ్యాంగురాలైన కూతురికి సపర్యలు చేస్తూ తన రెక్కల కష్టంతో అందరినీ పోషిస్తోంది. 

కరోనాతో ఛిన్నాభిన్నం.. 
ఇటీవల నర్సవ్వ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నర్సవ్వ కరోనా బారినపడడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తల్లికి, తనకు, ఇద్దరు పిల్లలకు దిక్కెవరు అంటూ రోదించేవాడు. నర్సవ్వ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఈ నెల 13న రాములు కరోనాతో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన నర్సవ్వ ఆస్పత్రిలోనే మరింత కుంగిపోయింది. ఈ నెల 20న ఆమె కూడా చనిపోయింది.

ఆమె వైద్యం కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం నిలబడలేదు. వారం రోజుల్లోనే ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు, వృద్ధురాలు రోడ్డున పడ్డారు. నానమ్మ వయసు పైబడటం, పెద్ద అమ్మాయి సొంతంగా తన పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి భారమంతా చిన్నమ్మాయి సమితపై పడింది. బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత మోయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

ఎలా పోషించాలో తెలియదు: సమిత  
మా నాన్న కొన్నేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అక్క వికలాంగురాలు.. తన పనులు కూడా సొంతంగా చేసుకోలేదు. నానమ్మకు చేతకాని పరిస్థితి. అన్ని పనులు మా అమ్మ చూసుకునేది. నాన్న ఏపనిలోనైనా అమ్మకు ధైర్యం చెబుతూ తోడుగా ఉండేవాడు. అమ్మానాన్నను కరోనా పొట్టనపెట్టుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నేను.. నానమ్మ, వికలాంగురాలైన అక్కను ఎలా పోషించాలో తెలియడం లేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-06-2021
Jun 01, 2021, 06:11 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.   1....
01-06-2021
Jun 01, 2021, 06:04 IST
సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన...
01-06-2021
Jun 01, 2021, 05:55 IST
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని...
01-06-2021
Jun 01, 2021, 05:42 IST
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల...
01-06-2021
Jun 01, 2021, 05:23 IST
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా నుంచి తొమ్మిది రోజుల పసికందును విశాఖ వైద్యులు రక్షించారు. 26 రోజుల చికిత్స అనంతరం...
01-06-2021
Jun 01, 2021, 04:26 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి ఏడాదిన్నర కింద చైనాలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదై తగ్గిన...
01-06-2021
Jun 01, 2021, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ...
01-06-2021
Jun 01, 2021, 04:06 IST
సాక్షి, హైదరాబాద్‌: 18004194961. ఇది కోవిడ్‌–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు లేకున్నా...
01-06-2021
Jun 01, 2021, 04:05 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్‌ 10 వరకు కొనసాగించాలని...
01-06-2021
Jun 01, 2021, 03:59 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్‌ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని...
01-06-2021
Jun 01, 2021, 03:04 IST
జెనీవా: భారత్‌లో తొలుత వెలుగుచూసిన కోవిడ్‌ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే...
01-06-2021
Jun 01, 2021, 02:55 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్‌వేవ్‌లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం...
31-05-2021
May 31, 2021, 17:12 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైన సోమవారం...
31-05-2021
May 31, 2021, 15:37 IST
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్​డౌన్​ కారణంగా తిరిగి అమ్మ...
31-05-2021
May 31, 2021, 14:56 IST
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి.  దీని​ వలన...
31-05-2021
May 31, 2021, 13:55 IST
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను...
31-05-2021
May 31, 2021, 03:49 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం...
31-05-2021
May 31, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర...
31-05-2021
May 31, 2021, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు....
31-05-2021
May 31, 2021, 00:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top