Paradise-Dmart Fined: డీమార్ట్‌, ప్యారడైజ్‌కు భారీ జరిమానా

Paradise Restaurant And Dmart Fined For Carry Bag Charge - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని  డీమార్ట్‌ షాపింగ్‌ మాల్‌, ప్యారడైజ్‌ రెస్టారెంట్లకు ఊహించని షాక్‌ తగిలింది. వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు తాజాగా వినియోగదారుల పోరమ్‌ జరిమానా విధించింది. హైదర్‌గూడ డీమార్ట్‌ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్‌, బేగంపేట ప్యారడైజ్‌ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్‌ కోర్టు రూ.50 వేల చొప్పున జ‌రిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.

అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్‌ తీర్పు చెప్పింది. కాగా, విజయ్‌ గోపాల్‌ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్‌ కోసం రూ.4.76 చార్జ్‌ చేశారు. 2019 జూన్‌లో హైదరాగూడ డీమార్ట్‌ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్‌ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో  కమిషన్ తాజా తీర్పునిచ్చింది.

చదవండి: Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top