భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం | Sakshi
Sakshi News home page

Tokyo Paralympics 2021: భళా భవీనా: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం

Published Fri, Aug 27 2021 7:03 PM

Tokyo Paralympics 2021:Bhavina Ben Patel Assures India a Medal, Enters semifinals - Sakshi

టోక్యో: టోక్యో వేదికగా జరుగుతన్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. భారత ప్యాడ్లర్‌ భవీనా పటేల్‌ సంచలనం సృష్టించింది. టేబుల్‌ టెన్నిస్‌  మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4 విభాగంలో సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్ 2, రియో పారా ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. 

ప్రత్యర్థి రాంకోవిక్‌ను 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. కాగా శనివారం జరిగే సెమీ ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన జాంగ్ మియావోతో తలపడుతుంది. కాంస్యం కోసం ప్లే ఆఫ్‌ లేకపోవడంతో భవీనాకు పతకం ఖాయమైంది. ఓడిపోయిన సెమీ-ఫైనలిస్టులు ఇద్దరూ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంటారు.

చదవండి: IND Vs ENG 3rd Test Day 3: తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌(8) ఔట్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement