4 గంటలు.. 3 సర్జరీలు

Orthopedic Doctors Operated Three People In Four Hours  - Sakshi

సాక్షి గాంధీ ఆస్పత్రి: గాంధీఆస్పత్రి ఆర్థోపెడిక్‌ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురికి శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఆగయ్య (63), ఖమ్మం జిల్లా వాసి అయిలయ్య(65), ముషీరాబాద్‌కు చెందిన నీలవేని (50)లకు మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ వాల్యా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏకబిగిన మూడు కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఆయుష్మాన్‌ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా సర్జరీలు ఉచితంగా చేసినట్లు గాంధీ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, మైక్రోబయోలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ రాజేశ్వరరావు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ వాల్యా, అనస్థీషియా హెచ్‌ఓడీ బేబిరాణి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీదేవి, శ్రీనివాస నాయక్‌ అనీల్‌కుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అబ్బయ్య, కిరణ్, అక్రమ్‌లు అభినందలు అందుకున్నారు.

(చదవండి: అంతు చిక్కని అస్వస్థత)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top