హైదరాబాద్‌ డాక్టర్‌కు బ్రిటిష్‌ అత్యున్నత అవార్డు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ డాక్టర్‌కు బ్రిటిష్‌ అత్యున్నత అవార్డు

Published Thu, Mar 31 2022 4:59 AM

Order Of British Empire Conferred On Indian Surgeon Raghu Ram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటిష్‌ రెండో అత్యున్నత ర్యాంకింగ్‌ అవార్డు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌–2021’ను ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. లండన్‌ దగ్గర్లోని విండ్సర్‌ క్యాసిల్‌లో జరిగిన వేడుకలో ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ ఈ అవార్డును ప్రదానం చేశారు.

భారత్‌లో రొమ్ము కేన్సర్‌ నుంచి సంరక్షణ, శస్త్ర చికిత్స విద్యను మెరుగుపరచడం, యూకే–భారత్‌ మధ్య సత్సంబంధాలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు రఘురామ్‌ ఈ అవార్డును పొందారు.కిమ్స్‌ఆస్పత్రిలోని సహో ద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భార తీయ శస్త్ర చికిత్స డాక్టర్లకు ఈ అవార్డును అంకి తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రఘురామ్‌ అత్యంత చిన్నవయసులో 2015లో పద్మశ్రీని, 2016లో బీసీ రాయ్‌ నేషనల్‌ అవార్డును అప్ప టి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 

Advertisement
 
Advertisement