ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ చేస్తూ ..

Nizamabad District Private Electrician Passed Away Due To Transformer Electric Shock - Sakshi

వేల్పూర్‌: నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం సాహెబ్‌పేట్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ బట్టు బాలయ్య (59) శనివారం జానకంపేట్‌ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుదాఘాతానికి గురై మర ణించాడు. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి వ్యవసాయ పంపులకు విద్యుత్‌ అందట్లేదని రైతులు చెప్పడంతో ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా ఆపేసిన బాలయ్య దానిపైకి ఎక్కాడు. కానీ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే ఇన్సులేటర్‌ ఒకటి విరగడంతో యథావిధిగా విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీన్ని బాలయ్య గమనించకపోవడంతో పైకెక్కగానే షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మరణించాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top