‘పశ్చిమబెంగాల్‌లో జరిగిందే.. తెలంగాణలో..’ | Nitin Nabin on a tour of Telangana | Sakshi
Sakshi News home page

‘పశ్చిమబెంగాల్‌లో జరిగిందే.. తెలంగాణలో..’

Jun 28 2026 4:39 PM | Updated on Jun 28 2026 6:01 PM

Nitin Nabin on a tour of Telangana

సాక్షి హైదరాబాద్‌: రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌ అన్నారు. ఈ రోజు (ఆదివారం) తొమ్మిది జిల్లాలలో బీజేపీ ఆఫీసులను వర్చువల్‌గా ‍ప్రారంభించారు. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో జరిగిందే తెలంగాణలోనూ జరుగుతుందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోందన్నారు.

కాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ రోజు హైదరాబాద్‌ చేరుకున్న ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. క్యాడర్‌ని బలోపేతం చేసేలా పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు.

జూన్‌ 29న రేపు ( సోమవారం) ఘట్‌కేసర్‌లోని VBIT ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. తర్వాత వరంగల్ పర్యటనలో భాగంగా గిరిజన సంఘాల నేతలతో, పోలింగ్ బూత్ అధ్యక్షులతో సమావేశమవుతారు. తదుపరి జూన్‌ 30 నఘట్‌కేసర్‌లో రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేసి, అనంతరం ఢిల్లీకి పయనం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement