కోర్టుకు నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులు.. | Narsing Drugs Case Update Today | Sakshi
Sakshi News home page

కోర్టుకు నార్సింగ్ డ్రగ్స్ కేసు నిందితులు..

Jul 16 2024 10:03 AM | Updated on Jul 16 2024 10:24 AM

Narsing Drugs Case Update Today

సాక్షి,హైదరాబాద్‌ : నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను తెలంగాణ పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.  

సోమవారం హైదర్షాకోట్‌లో డ్రగ్స్‌ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, వారి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, అమన్ తోపాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్‌లు ఉన్నారు.  

అరెస్ట్ అయిన పెడ్లర్లలో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీలు ఉన్నట్లు రాజేంద్ర నగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

డ్రగ్స్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement