మెరిసిన ‘పేట’ తేజం

Narayanpeta Narsimhulu 272nd Rank in UPSC Results - Sakshi

యూపీఎస్‌సీ ఫలితాల్లో 272వ ర్యాంకు 

రాహుల్‌ను అభినందించిన ఎస్పీ డా.చేతన 

రెండో ప్రయత్నంలో చాకలిగడ్డతండా వాసికి  764వ ర్యాంక్‌ 

నారాయణపేట రూరల్‌/జడ్చర్ల టౌన్‌  : వలసలు.. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న నారాయణపేట జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో పేటకు చెందిన రాహుల్‌ ఆలిండియాలో 272వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్‌ పీఈటీ నర్సింహులు, హిందీ టీచర్‌ శశికళ దంపతుల కుమారుడైన రాహుల్‌ పదో తరగతి వరకు నారాయణపేటలోనే విద్యాభ్యాసం చేశారు. 2016లో ఏఈగా ఎంపికైనా ఆయన సివిల్స్‌ సాధించేందుకు రెండేళ్లు లాంగ్‌లీవ్‌ పెట్టి అనుకున్నది సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలం చాకలిగడ్డతండా వాసి శశికాంత్‌కు 764వ ర్యాంక్‌ వచ్చింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top