మేడారానికి పోటెత్తిన భక్తులు

More Than 1. 5 Lakh Devotees Attend Mini Medaram Jatara In Mulugu - Sakshi

ఆదివారం 1.50 లక్షల మందికిపైగా రాక

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలో మినీజాతర ముగిసినప్పటికీ భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. ఆదివారం 1.50 లక్షల మందికిపైగా భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.

అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఏర్పాట్లను ఈవో రాజేంద్రం పర్యవేక్షించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top