
సంస్థాన్ నారాయణపురం: ‘కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను.. ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలూ చేయను’అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని బోటిమిదితండా శివారులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సమయం వచ్చినప్పుడు మా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్ నిర్ణయించుకుంటానని అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగాలా, వీడాలా అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. అధికారంలోకి రాలేకపోయామని బాధతో రెండు, మూడుసార్లు మాట్లాడానన్నారు.