అన్నావదిన... దీవించండి | Minister Vivek Venkat Blessings To family Numbers | Sakshi
Sakshi News home page

అన్నావదిన... దీవించండి

Jun 12 2025 7:47 AM | Updated on Jun 12 2025 7:47 AM

Minister Vivek Venkat Blessings To family Numbers

మంచిర్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్‌ తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వివేక్‌ హైదరాబాద్‌లో ఉన్న  తన సోదరుడి ఇంటికి వెళ్లారు. 

ఈ సందర్భంగా అన్నా వదినల కాళ్లకు సమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లప్పుడు ఇలాగే తనపై ప్రేమానురాగాలు ఉంచాలని వివేక్‌ తన సోదరుడిని కోరారు. అనంతరం  మంత్రి, ఎమ్మెల్యేను కాంగ్రెస్‌ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  నర్సింగరావు, మునిమంద రమేశ్, కేవీ ప్రతాప్, హరీష్‌ గౌడ్, ఎం.మహేందర్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement