‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా భారత్‌  | Minister Mansukh Mandaviya revealed India As Pharmacy Of The World | Sakshi
Sakshi News home page

‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా భారత్‌ 

Feb 27 2023 2:32 AM | Updated on Feb 27 2023 9:42 AM

Minister Mansukh Mandaviya revealed India As Pharmacy Of The World - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఫార్మా ఉత్పత్తులను అందిస్తామనే భరోసా ఇచ్చి ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా భారతదేశం కీర్తికెక్కిందని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా వెల్లడించారు. ‘ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు’పై కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబాతో కలిసి రెండ్రోజుల చింతన్‌ శిబిర్‌ను మాండవీయ ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఫార్మా, ఆరోగ్య రంగాలలోని వాటాదారులు, లబ్ధిదారులందరికీ పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి, అందుకు సంబంధించిన విధానాల కోసం మార్గాలను చర్చించడానికి చింతన్‌ శిబిర్‌ ఒక వేదికన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement