Telangana: Harish Rao launches Arogya Mahila Scheme on Women's day - Sakshi
Sakshi News home page

ఉమెన్స్‌ డే స్పెషల్‌: తెలంగాణలో ఆరోగ్య మహిళ పథకం ప్రారంభం

Mar 8 2023 1:54 PM | Updated on Mar 8 2023 4:08 PM

Minister Harish Rao Launches Arogya Mahila In Telangana - Sakshi

సాక్షి, కరీంనగర్‌: మహిళా దినోత్సవం సందర్బంగా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ఆరోగ్య మహిళ పథకాన్ని కరీంనగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ పథకం కింద 100 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ఆరోగ్య మహిళ కిట్‌ను, లోగోను ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్బంగా ఆరోగ్య మహిళ పథకంలో ఎనిమిది రకాలు సేవలు అందించునున్నారు. ప్రతీ మహిళా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వాటి పరిష్కారం కోసమే ఈ పథకం తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదట 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామన్నారు. పెద్ద ఆసుపత్రుల్లో అందించే చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తాయన్నారు. 

శ్రీరామ నవమి తరువాత న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలు గర్భం దాల్చిన తర్వాత వారికి పోషకాహరం కోసం న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అందిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లాలలోనూ ఆరోగ్య మహళ క్లినిక్ లను ఆయా జిల్లాలలోని స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారని తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement