వ్యాక్సిన్‌ వేయించుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి!

Medical Department Has Asked For Report On Health Worker Death - Sakshi

సాక్షి, వరంగల్‌ : కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది హెల్త్‌ వర్కర్స్‌, ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారు. రానున్న రోజుల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్‌ కోరల్లో నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని వైద్యులతో పాటు ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలో కరోనా టీకా తీసుకున్న కొందరు అస్వస్థతకు గురవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. టీకా తీసుకున్న అనంతరం ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఒక్కరు చొప్పున  మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌! 

గుండెపోటుతో నిర్మల్‌లో విఠల్‌రావు చనిపోగా, గుంటూరులో ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ డెడ్ అయింది. అయితే వీరి మరణాలకు కోవిడ్‌ టీకానే కారణమా అని ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకున అనంతరం మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. వరంగల్‌ అర్బన్‌ శాయంపేట అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్‌ వనిత.. ఈ నెల 22న వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆమె మరణించారు. అయితే వ్యాక్సిన్‌ వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యాక్సిన్‌ రియాక్షన్‌ కారణంగానే మరణించిందని వైద్యులు నిర్థారించలేదు. చదవండి: ఒకవేళ విద్యార్థులకు కరోనా సోకితే..

ఘటనపై నివేదిక కోరిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌
వరంగల్ అర్బన్ జిల్లాలో హెల్త్‌ కేర్ వర్కర్‌ మృతిపై జిల్లా అధికారులను తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదిక కోరారు. హెల్త్‌ కేర్‌ వర్కర్‌ మరణంపై ఏఈఎఫ్‌ఐ నివేదికను సిద్ధం చేస్తోంది. కేంద్ర ఏఈఎఫ్‌ఐ బృందంతో చర్చించాకే తుది నివేదిక ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-02-2021
Feb 23, 2021, 18:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా...
23-02-2021
Feb 23, 2021, 04:09 IST
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు....
23-02-2021
Feb 23, 2021, 03:09 IST
న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్ర వైద్య శాఖాధికారులతో సోమవారం...
23-02-2021
Feb 23, 2021, 02:55 IST
లండన్‌: యూకేలో ప్రస్తుతం అమలవుతున్న కోవిడ్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను నాలుగు దశల్లో ఎత్తి వేసేందుకు ఉద్దేశించిన రోడ్‌ మ్యాప్‌ను ప్రధానమంత్రి...
22-02-2021
Feb 22, 2021, 15:11 IST
ముంబై సెంట్రల్ ‌: ముంబై నగర పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈసారి...
22-02-2021
Feb 22, 2021, 11:34 IST
రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే  లాక్‌డౌన్‌ తప్పదు
22-02-2021
Feb 22, 2021, 03:58 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభి స్తోందనే భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు...
21-02-2021
Feb 21, 2021, 14:33 IST
పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలను సైతం మూసివేశారు.
21-02-2021
Feb 21, 2021, 05:21 IST
న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులకు మధ్య మూడు నెలల వ్యవధి తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందని తాజా అధ్యయనం...
21-02-2021
Feb 21, 2021, 05:13 IST
కరోనా మహమ్మారి కేసుల్లో అకస్మాత్తుగా పెరుగుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెచ్చరించింది.
20-02-2021
Feb 20, 2021, 09:00 IST
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,400 వైరస్‌ జన్యుక్రమాలు మాత్రమే నమోదై ఉన్నాయని, వీటిల్లోనే 5 వేల కంటే ఎక్కువ రూపాంతరాలు ఉన్నాయని...
20-02-2021
Feb 20, 2021, 09:00 IST
కరోనాతో బాధపడుతున్న సంగారెడ్డికి చెందిన అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు (50) గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం మృతిచెందారు.
20-02-2021
Feb 20, 2021, 08:39 IST
'మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్‌ను దొంగిలించారు' అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ...
19-02-2021
Feb 19, 2021, 20:46 IST
ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.
19-02-2021
Feb 19, 2021, 16:11 IST
ప్రజల్లో కరోనా పట్ల పెద్దగా భయం లేకపోవడం, జాగ్రత్తలు పాటించకపోవడంతో కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు.  
18-02-2021
Feb 18, 2021, 02:19 IST
జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి...
17-02-2021
Feb 17, 2021, 13:21 IST
సాక్షి, హైదరాబాద్‌: గతనెల 7న భూటాన్‌ రాజధాని థింపూలోని ఒక ఆసుపత్రిలో 34 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి...
16-02-2021
Feb 16, 2021, 18:46 IST
బెంగళూరు: ఒకే అపార్టుమెంటులో నివసిస్తున్న దాదాపు 103 మంది ఒకేసారి కరోనా వైరస్‌ బారిన పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల అపార్టుమెంటులో నిర్వహించిన పార్టీలో దాదాపు 45 మంది...
16-02-2021
Feb 16, 2021, 08:19 IST
కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతోంది. కొత్తకొత్త స్ట్రెయిన్స్‌ వస్తున్నాయి. కొన్నాళ్లుగా నిపుణులు చెబుతున్నది కూడా ఇదే.. అదే సమయంలో కరోనా...
16-02-2021
Feb 16, 2021, 01:12 IST
2020 సెప్టెంబర్‌ నాటికి రోజువారీ కేసులు 99 వేల స్థాయికి చేరి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అప్పటి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top