పెళ్లి బరాత్‌: వరుడిపై కేసు నమోదు..

Medak: Case Registered Against Groom For Conducting The Wedding Baraat - Sakshi

సాక్షి, మెదక్‌: కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి వివాహ బరాత్‌ నిర్వహించినందుకు గాను వరుడితో పాటు అతని తండ్రి, డీజే సౌండ్‌ సిస్టం యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్‌ సిస్టం, సౌండ్‌ బాక్స్‌లను సీజ్‌ చేశారు. ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు వివాహం జరగగా శనివారం రాత్రి గ్రామంలో ట్రాక్టర్‌తో డీజే సౌండ్‌ సిస్టం పెట్టి ఎక్కువ మందితో భౌతిక దూరాన్ని పాటించకుండా బరాత్‌ నిర్వహిస్తున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కోవిడ్‌, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. ఈమేరకు డీజే సౌండ్‌ సిస్టం, సౌండ్‌ బాక్స్‌లను సీజ్‌చేశారు. వరుడు నర్సింహులు, వరుడి తండ్రి సాయిలు, డీజే సౌండ్‌ సిస్టం యజమాని ఇటిక్యాల రవిపై కేసు నమోదు చేశారు.

చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top