కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: మాణిక్యం ఠాగూర్

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజుల రాహుల్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఆయన శని వారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ పర్యటనను సక్సెస్ చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేళ్ల పాటు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చినప్పటికీ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు.