సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా?

Manda Krishna Madiga Fire On Cm Kcr Is Anti Dalit Empowerment - Sakshi

బౌద్ధనగర్‌ (హైదరాబాద్‌): దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌ దళిత సాధికారతపై మాట్లాడటం పచ్చి మోసమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత సాధికారతపై ఆదివారం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు సాధికారత గురించి మాట్లాడటం పచ్చిమోసం, నిలువెత్తు నయ వంచనకు ప్రతీక అని పేర్కొన్నారు. 

చదవండి :  Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్‌ ప్రశంసలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top