గతేడాది పాస్‌.. ఈ ఏడాది వాడాడు.. 

A Man In Telangana Used Emergency Pass Which Is Given By Last Year - Sakshi

హైదరాబాద్‌: గతేడాది మార్చి 23న కరోనా లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసరాల కోసం వెళ్లేవారికి పోలీసులు పాస్‌లు పంపిణీ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌బీ అదనపు డీసీపీ గతేడాది మార్చి 31వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఓ వ్యక్తికి అత్యవసర పాస్‌ ఇచ్చారు.

ఆ పాస్‌ గడువు కూడా గతేడాది మార్చి 31తో ముగిసింది. సదరు వ్యక్తి మాత్రం అదే పాస్‌ను రెండో దశ లాక్‌డౌన్‌లో వినియోగిస్తూ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు లోతుగా ఆరా తీయగా ఆ వ్యక్తి గతేడాది పాస్‌ను కారుకు అంటించుకొని తిరుగుతున్నట్లుగా తేలింది. ఆ పాస్‌ను పోలీసులు చించేసి ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top