చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం  | Madhya Pradesh CM Shivraj Singh Chouhan Meets Chinna Jeeyar Swamy | Sakshi
Sakshi News home page

చినజీయర్‌ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం 

Nov 18 2020 3:56 AM | Updated on Nov 18 2020 4:03 AM

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Meets Chinna Jeeyar Swamy - Sakshi

శంషాబాద్‌ రూరల్ ‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మంగళవారం ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణంలో చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్‌కు అహోబిల జీయర్‌ స్వామి, ఆశ్రమం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం దివ్యసాకేతాలయంలో చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్‌కు చినజీయర్‌ స్వామి తీర్థ ప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. ఆశ్రమం సమీపంలో జరుగుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం పనులను జీయర్‌స్వామితో కలసి చౌహాన్‌ పరిశీలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement