హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్‌గడ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి వద్ద నుంచి 34 ఆయుధాలను సరెండర్ చేసుకున్నారు. వీరిని ఈరోజు(శనివారం, ఏప్రిల్ 25వ తేదీ) మీడియా ముందు ప్రవేశపెట్టారు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి. ఈ మేరకు డీజీపీ మాట్టాడుతూ.. వారంతా చత్తీస్‌గడ్‌కు చెందిన మావోయిస్టులేనని పేర్కొన్నారు.
డీజీపీ శివధర్‌రెడ్డి ఏమన్నారంటే..
తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 32 తుపాకులను కూడా పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు మరియు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంర్జి అయిన హేమ్లా ఇతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ అయిన పోడియం లచ్చు అలియాస్ మనోజ్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు. లొంగిపోయిన మావోలు పోలీసులకు 32 ఆయుధాలతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను అప్పగించారు.
పోలీసులకు సమర్పించిన ఆయుధాలు
1 - LMG,4 - AK-47 రైఫిల్స్
3 - SLR రైఫిల్స్,2 - INSAS రైఫిల్స్
2 - 410 మస్కెట్ రైఫిల్స్,1 - 8mm రైఫిల్
12 - సింగిల్-షాట్ గన్స్,1 - 9mm పిస్టల్
1 - రివాల్వర్,2 - BGL గన్స్
2 - ఎయిర్ గన్స్,1 - SBBL గన్
దక్షిణ బస్తర్ డివిసి (DVC) కార్యదర్శితో సహా కీలక నాయకులు, సాయుధ కేడర్లు దాదాపు అందరూ ఈరోజు లొంగిపోవడంతో, ప్రస్తుతం దక్షిణ బస్తర్ డివిసి మొత్తం నిర్వీర్యం అంచుకు చేరుకుంది.
లొంగిపోయిన 47 మంది క్యాడర్ల వారీగా వివరాలు
PLGA బెటాలియన్: 4 మంది
DKSZC: 28 మంది
9వ & 30వ ప్లాటూన్, దక్షిణ బస్తర్ DVC: 15 మంది (మొత్తం: 47 మంది) లొంగిపోవడం జరిగింది.
తెలంగాణకి చెందిన నలుగురు మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు
వారు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని అభ్యర్థిస్తున్నాము
‘జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు మరియు పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండేళ్లలో 818 మంది తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు. గత రెండేళ్లలో 334 ఆయుధాలను మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ పేర్కొన్నారు.
అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు
1. లక్ష్మణరావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు
2. పసునూరి నరహరి అలియాస్ సంతోషం కేంద్ర కమిటీ సభ్యులు
3. జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత ,స్టేట్ కమిటీ మెంబర్
4. వార్త శేఖర్ అలియాస్ మంగు, స్టేట్ కమిటీ మెంబర్


