
అప్పు చెల్లించినా చంపుతామని బెదిరిస్తున్నారు
మోకిల పీఎస్‌లో బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్: తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించినప్పటికీ తన భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి శనివారం మోకిల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మోకిలకు చెందిన ఫరీద్ కుటుంబ అవసరాల నిమిత్తం 2021లో తన భూమిని హైదరాబాద్‌కి చెందిన సునీల్ కుమార్‌అహుజా, అశీ అహుజాలకు రిజిస్ట్రేషన్(తాకట్టు) చేసి, రూ.17 కోట్లు అప్పుగా తీసుకున్నాడు.
2022 డిసెంబర్‌లో వడ్డీతో కలిసి రూ.22 కోట్లు చెల్లించాడు. అనంతరం భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా కాలయాపన చేస్తూ వచ్చారు. కాగా మొదటి నుంచి ఫరీద్ భూమి కబ్జాలో ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సునీల్, అశీష్ భూమి వద్దకు చేరుకుని అతనితో గొడవ పడ్డారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరబాబు తెలిపారు.