డ్రెస్సులు మార్చుతూ చోరీలు చేస్తున్న మహిళ | lady thief arrested in Secunderabad | Sakshi
Sakshi News home page

డ్రెస్సులు మార్చుతూ చోరీలు చేస్తున్న మహిళ

Jun 1 2025 7:11 AM | Updated on Jun 1 2025 7:11 AM

దొంగతనానికి వెళ్లేపట్పుడు చీరలో..

 చోరీ చేసిన తరువాత జీన్స్‌ప్యాంటు,కోటు 

ఇంటికి చేరుకునే సమయంలో నైటీలో.. 

ఎట్టకేలకు పట్టుబడ్డ నిందితురాలు

సికింద్రాబాద్‌:  దొంగతనం చేసే సమయంలో మూడు డ్రెస్సులు మార్చుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ జే.నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కే.శశాంక్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపిన మేరకు.. పార్సిగుట్టకు చెందిన దుర్గ  ఇంట్లో ఈనెల 23న  6.7 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.38 వేలు మాయమయ్యాయని బాధితురాలు వారాసీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

500 సీసీ కెమెరాల పరిశీలనతో.... 
వారాసీగూడ పోలీసులు దుర్గ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.  పార్శిగుట్ట నుంచి మచ్చ»ొల్లారం వరకు ఉన్న సుమారు 500 కెమెరాలను పరిశీలించారు. మొత్తం పుటేజీల్లో ఒక మహిళ ప్రయాణం కనిపించింది. అయితే సీసీ కెమెరాలు మారినకొద్దీ ఆమె ధరించిన దుస్తులు మారుతుండడంతో పోలీసులకు అనుమానం వచి్చంది.  మచ్చొల్లారం ప్రాంతంలో వరుస సీసీ కెమెరాలు పరిశీలించే సరికి ఒకే మహిళ «మూడు రకాల దుస్తుల్లో కనిపించడంతో  ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడింది మచ్చ»ొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీది విజయ (45)గా గుర్తించారు.  

విచారణలో మరో రెండు నేరాలు
సీసీ పుటేజీలోని మహిళ పోలికల ఆధారంగా విజయను పట్టుకున్న పోలీసులు విచారింగా ఇదే తరహాలో దుస్తులు మార్చుతూ లోగడ మరో రెండు నేరాలకు పాల్పడినట్టు అంగీకరించింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ పీఎస్, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పేర్కొంది. సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు తాను ఒక్కో దొంగతనం చేయడం కోసం చీర, జీన్స్, నైటీ ఇలా మూడు రకాల దుస్తులు ధరించినట్టు పేర్కొంది. నిందితురాలి నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వా«దీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement