
వర్చువల్ ద్వారా మహబూబాబాద్ పోక్సో కోర్టును ప్రారంభిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ
మహబూబాబాద్ రూరల్/జనగామ: జిల్లాల్లో పోక్సో కోర్టుల ఏర్పాటు ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ అన్నారు. మహబూబాబాద్, జనగామలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టులను సోమవారం ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు, వరంగల్ నుంచి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు పాల్గొన్నారు.
మహబూబాబాద్ గిరిజన జిల్లాలో ఇలాంటి కోర్టు అత్యవసరమన్నారు. పునర్విభజనలో ఏర్పడిన కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి కోర్టు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక, జడ్జి అనిల్ కిరణ్‌కుమార్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు.