జస్టిస్‌ చంద్రయ్యకు ‘నెల్సన్‌ మండేలా అవార్డ్‌’

Justice Chandraiah Honour With Nelson Mandela Award - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య ప్రతిష్టాత్మక ‘నెల్సన్‌ మండేలా అవార్డ్‌’అందుకున్నారు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఢిల్లీ నేషనల్‌ కో–ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ఈ అవార్డును ఆయనకు అందించారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ హోదాలో జస్టిస్‌ చంద్రయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్‌సీయూఐ, ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top