ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న | Janashakti Kura Rajanna Says Wrong Case Filed Against Him | Sakshi
Sakshi News home page

ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న

Apr 22 2023 2:07 PM | Updated on Apr 22 2023 2:47 PM

Janashakti Kura Rajanna Says Wrong Case Filed Against Him - Sakshi

సాక్షి, కామారెడ్డి: ప్రజాయుద్ధంతోనే సమాజానికి రక్షణ ఉంటుందని  సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న అన్నారు. భూస్వాములను, దొరలను ప్రభుత్వాలు, పోలీసులు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని, తాను పారిపోయినట్లు పోలీసులు తప్పుడు ప్రచారం  చేస్తున్నారని వాపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సాగర్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని,  కానీ ఆ వ్యక్తిని కూడా తమతో కలిపి కేస్ చేయడం సరికాదన్నారు.

బీడీ కంపెనీలు రక్షణ కోసం ఫండ్ ఇవ్వడం ఆనవాయితీ అని, కానీ కావాలనే డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని కూర రాజన్న పెట్టారు. పెట్టిన కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా..  కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న బెయిల్‌ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు.
చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

Advertisement
 
Advertisement
Advertisement