హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మియాపూర్, చందనగర్‌లో కుండపోత వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్‌లో భారీ వర్షం కురవగా, మణికొండ, గచ్చిబౌలి, కొంపల్లిలో వడగళ్ల వాన పడింది. వానవెలిసే వరకు మెట్రో పిల్లర్ల కింద కొందరు వాహనాలను కాసేపు ఆపే ప్రయత్నం చేశారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో గాలివానతో పాటు పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం పడింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయి.



