తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. కాసేపట్లో ఈ జిల్లాల్లో.. | IMD Says Three Days Rains In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. కాసేపట్లో ఈ జిల్లాల్లో..

Apr 21 2026 11:39 AM | Updated on Apr 21 2026 11:48 AM

IMD Says Three Days Rains In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో పలు జిల్లాలో వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. ఇక, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rain Hits Several Places In Hyderabad Photos5

నేడు మరో రెండు లేదా మూడు గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. హైదరాబాద్‌ ఈరోజు సాయంత్రం మోస్తరు వర్షం కురిసే చాన్స్‌ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కళ్లాల్లో చేర్చినట్లయితే టార్ఫలిన్ కవర్లు కప్పి ఉంచాలని చెబుతున్నారు.

Rain Hits Several Places In Hyderabad Photos11

 

Advertisement
 
Advertisement
Advertisement