TG: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు | Ias Trainees Visiting Bus Bhavan Hyderabad | Sakshi
Sakshi News home page

TG: బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

Jun 14 2024 6:35 PM | Updated on Jun 14 2024 6:54 PM

Ias Trainees Visiting Bus Bhavan Hyderabad

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్‌ని శుక్రవారం సందర్శించారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్‌ని శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.

తెలంగాణ కేడర్‌కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టీకల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్‌ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్‌లు ఉమా హారతి, గరిమా నరులా, మనోజ్‌, మృణాల్‌, శంకేత్‌, అభిజ్ఞాన్‌, అజయ్‌లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, కృష్ణకాంత్‌లతో పాటు ఎంసీఆర్ హెచ్ఆర్డీ సీడీఎస్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement