
సాక్షి, పంజగుట్ట: ప్రగతిభవన్‌లో దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్‌బెడ్‌రూంలు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. వివరాలివీ... ఆర్మూర్‌కు చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) కేపీహెచ్‌బీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, డబుల్‌బెడ్‌రూం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చదవండి:
యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్
బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే