హైదరాబాద్: హుసేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ముందస్తు పథకం ప్రకారమే భార్య రేణుక భర్తను మానసికంగా కుంగిపోయేలా చేసిందనే అనుమానాలను కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రైవేటు వీడియోలు ఉద్దేశ్యపూర్వకంగానే భర్తకు చేరేలా చేశారనే అంశంపై కూడా విచారణ జరుగుతోందని తెలిసింది.
ఇదిలా ఉండగా జనవరి 26నే రేణుక ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భార్య అదృశ్యమైన విషయంపై సీతారాం.. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడని.. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఈ ఘటన ఉండేది కాదని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా పోలీసులు మృతుడి భార్య రేణుక, నిందితుడు రమణారెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


