రోడ్లు సరే.. అడుగెట్ల..

Hyderabad: Not Undertaking Footpath Works For Pedestrians - Sakshi

ఫుట్‌పాత్‌ల పనుల్లో జాప్యం

పాదచారులకు తప్పని ఇబ్బందులు 

సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడంతో గ్రేటర్‌లోని  ప్రధాన రహదారుల మార్గాల్లో  వాహనదారుల ఇబ్బందులు కొంత మేర తగ్గాయి. కానీ పాదచారుల కష్టాలు మాత్రం తీరడంలేదు. ఈ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలే  ఫుట్‌పాత్‌ల పనులు కూడా చేయాల్సి ఉండగా రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల పనులు జరగడం లేదు. దాంతో పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్ల పనులు చేస్తున్నప్పటికీ, ఫుట్‌పాత్‌లు తదితర పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

సాక్షి, సిటీబ్యూరో : సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద నగరంలో రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు సమగ్రంగా చేపట్టాలి. ఇది కాంట్రాక్టు ఒప్పందంలోనూ ఉంది. కానీ దీన్ని ఎక్కడా సక్రమంగా అమలు చేయడం లేదు. రోడ్ల నిర్మాణం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారే తప్ప..పాదచారులకు అత్యంత కీలకమైన ఫుట్‌పాత్‌ల పనులు చేపట్టడం లేదు. చదవండి: ఇక రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత

కాంట్రాక్టు ఒప్పందం మేరకు .. 
► రోడ్ల నిర్వహణలో భాగంగా క్యాచ్‌పిట్స్, డ్రెయిన్లు, నాలాలు, సివర్‌ లైన్లు  ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.  
► రోడ్లపై నిల్వనీరు లేకుండా చర్యలు తీసుకోవాలి. 
► డెబ్రిస్‌ తొలగించాలి. బ్లాక్‌స్పాట్‌లు లేకుండా చూడాలి. 
► ఫుట్‌పాత్, టేబుల్‌ డ్రెయిన్, స్పీడ్‌ బ్రేకర్లు, బార్‌ మార్కింగ్స్, సెంట్రల్‌ మీడియన్, లేన్‌ మార్కింగ్, రోడ్‌ స్టడ్స్, సైనేజీ బోర్డులు, కెర్బ్‌ పెయింటింగ్‌లు వేయాలి. 
► సుందరీకరణ పనుల్ని కూడా చేయాలి. కానీ ఇవి పూర్తికాలేదు.  
► కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లు :709 కి.మీ. 
► వీటిల్లో మొదటి సంవత్సరం 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం 20 శాతం రోడ్ల పనులు పూర్తి చేయాలి. 
► ఐదు సంవత్సరాల వరకు నిర్వహణ పనులు చేయాలి. 
►నిబంధనల కనుగుణంగా రోడ్ల పనులు జరిగినప్పటికీ, ఫుట్‌పాత్‌ల పనులు జరగలేదు.  
► వీటిల్లో  డీబీఎం, వీడీసీసీ రోడ్లున్నాయి. 
►ఇవి కాక మరో 290 కి.మీ.లు బీసీ రోడ్లున్నాయి. 
► ఫుట్‌పాత్‌లు మాత్రం కొత్తవి, మరమ్మతులు చేసినవి వెరసి 22 కి.మీ.లే పూర్తయ్యాయి.  
►పాదచారులకు నడక మార్గాల్లేక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. 
► తీవ్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.  

ఇప్పటి వరకు  జరిగిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల పనులు ప్యాకేజీల వారీగా 

జోన్‌     రోడ్లు (కి.మీ.)   ఫుట్‌పాత్‌లు (కి.మీ.) 
ఎల్‌బీనగర్‌ 46.48    0.00
చార్మినార్‌         60.02  2.25
ఖైరతాబాద్‌(1)  43.52    3.82
ఖైరతాబాద్‌(2)  45.48   2.14 
శేరిలింగంపల్లి 52.83     4.57
కూకట్‌పల్లి 30.24     2.19
సికింద్రాబాద్‌     45.22     7.65
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top