
మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.
కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్‌ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు.