extended meeting
-
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు. -
జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్తో భారత ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఐదు రోజుల భారత పర్యటనలో ఉన్న వాల్టర్ను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో మోదీ కలిశారు. ‘సుందర్ నర్సరీకి జర్మనీ అధ్యక్షుణ్ని తీసుకెళ్లే గౌరవం నాకు దక్కింది. అనేక అంశాలపై మేం విస్తృత చర్చలు జరిపాం’ అని తర్వాత మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్లు చర్చించారు. అంతకు ముందు వాల్టర్ ఉప రాష్ట్రపతి వెంకయ్య, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలపై భారత్, జర్మనీల వైఖరి ఒకేలా ఉందని వెంకయ్య అన్నారు. వెంకయ్యను కలవడానికి ముందు రాష్ట్రపతి భవన్లో వాల్టర్కు ఘన స్వాగతం లభించింది. గురువారం భారత పర్యటనను ప్రారంభించిన వాల్టర్ ఆదివారం చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం మహాబలిపురం ఆలయాన్ని సందర్శిస్తారు. -
వంద రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ : జగన్
-
ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి: పార్టీ శ్రేణులకు జగన్ ఉద్బోధ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం ప్రారంభం అయ్యింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. రానున్న రోజుల్లో సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ప్రత్యేకంగా దానిపై చర్చించారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంపై అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు చాలా కీలకం అయినందున ఆ అంశంపై దృష్టిపెట్టాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. అలాగే గడప గడపకూ పార్టీ వెళ్లాలని, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలను అమలు చేస్తామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇక ఇన్నాళ్లూ పార్టీని ముందుండి నడిపించిన గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం జిల్లాల పర్యటనలు, నాయకులతో భేటీలు, పోరాటాలు, ఆందోళనలతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల పరిస్థితులు బాగా తెలియడంతో విజయమ్మ సైతం వివిధ జిల్లాల నాయకులకు తన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. -
ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి: జగన్
-
మరికాసేపట్లో YSRCP రాష్ట్ర స్ధాయి సమావేశం
-
ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్ధాయి సమావేశం