Hyderabad: Man Cheated Woman In Matrimony Looted Rs 6 Lakhs - Sakshi
Sakshi News home page

Hyderabad: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు.. అసలు విషయం తెలిసి షాక్‌!

May 5 2023 1:43 PM | Updated on May 5 2023 2:48 PM

Hyderabad: Man Cheated Woman In Matrimony Looted 6 lakhs - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో రూ.6 లక్షలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.6 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌కు చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌ పరిచయం ఏర్పడింది. తనకు వివాహం అయ్యిందని.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మి సదరు యువతి అతడితో పరిచయం పెంచుకుంది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని చెప్పడంతో రూ.6 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్‌కు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలియడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement