అమెరికాలో హైదరాబాదీ ‘గోల్డ్‌ స్కామ్‌’ | Hyderabad Man Arrested In USA For Fake Gold Scam Posing As CIA Agent, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో హైదరాబాదీ ‘గోల్డ్‌ స్కామ్‌’

Mar 28 2026 8:14 AM | Updated on Mar 28 2026 5:38 PM

hyderabad man arrested in usa for fake ciam gold scam

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి వెళ్లి అమెరికాలోని టెక్సాస్‌లో స్థిరపడ్డ సాయి ప్రవీణ్‌ కొమ్మన అక్కడ ఓ భారీ స్కామ్‌కు పాల్పడ్డాడు. నకిలీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఏజెంట్‌ అవతారం ఎత్తి, ఎక్సెల్సియర్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకుని, ఆమె నుంచి 97,240 డాలర్లు (దాదాపు రూ.92 లక్షల) విలువైన బంగారం కాజేశాడు. దీనిపై ఇటీవల అక్కడి క్లే కౌంటీ కోర్టులో అ«భియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ స్కామ్‌లో ఇతడికి మరో ఇద్దరు తెలుగు వాళ్లు సహకరించినట్లు ఆ కోర్టుకు పోలీసులు తెలిపారు.  

కస్టమర్‌ సరీ్వస్‌ను సంప్రదించబోయి... 
బాధిత మహిళ గత ఏడాది సెప్టెంబర్‌ 10న ఓ కంపెనీకి చెందిన కస్టమర్‌ సర్వీను సంప్రదించడానికి ప్రయత్నించారు. అనుకోకుండా ఆమె సాయి ప్రవీణ్‌కు ఫోన్‌ చేశారు. ఈ కాల్‌ అందుకున్న అతగాడు తాను సీఐఏ ఏజెంట్‌ అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. పథకం ప్రకారం వ్యవహరించిన ప్రవీణ్‌ నకిలీ బ్యాడ్జ్‌తో పాటు గుర్తింపు కార్డు ఫోటో కూడా పంపాడు. దీని ఆమె పూర్తిగా నమ్మడంతో ప్రవీణ్‌ అసలు కథ మొదలెట్టాడు. ఆమె సోషల్‌ సెక్యూరిటీ ఖాతా హ్యాక్‌ అయిందని చెప్పాడు. బ్యాంకులో ఉన్న నగదు నేరగాళ్ల పాలు కాకుండా ఉండాలంటే తక్షణం బంగారంగా మార్చాలని సూచించాడు. దీనికి అంగీకరించిన ఆమె అంత బంగారం తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎలా అని ప్రశ్నించారు.  

భద్రపరిచే బాధ్యతా తనదేనంటూ... 
దీంతో ఆ బాధ్యతలు తాను తీసుకుంటానని, గోల్డ్‌ బార్స్‌ను కొన్నాళ్లు భద్రంగా ఉంచి, ఆపై నగదుగా మార్చి బ్యాంకు ఖాతాలో వేస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు తన బ్యాంక్‌ ఖాతా నుంచి 97,240 డాలర్లను కాన్సాస్‌ సిటీ జ్యువెలరీ దుకాణానికి బదిలీ చేసి గోల్డ్‌ బార్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజు కారులో వచ్చిన ప్రవీణ్‌ ఆ బంగారం తీసుకుని వెళ్లాడు. కొన్ని రోజులకు బాధితురాలు విషయాన్ని తన కుమార్తెకు చెప్పడంతో ఆమె విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం ద్వారా బయటకు తెచ్చింది. ఇలా కేసు వెలుగులోకి రావడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రవీణ్‌ను గుర్తించి పట్టుకున్న పోలీసులు 
బాధితురాలి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన అక్కడి పోలీసులు ప్రవీణ్‌ను గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, బంగారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు తెలుగు వారి పాత్ర కూడా ఉన్నట్లు అమెరికా పోలీసులు నిర్థారించారు. గత ఏడాదే ఈ ముగ్గురినీ అరెస్టు చేయగా... ప్రవీణ్‌ తన నేరాన్ని అంగీకరించలేదు. దీంతో మిగిలిన ఇద్దరికీ శిక్ష విధించిన న్యాయస్థానం ఇతడికి బెయిల్‌ ఇచ్చింది. దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఇటీవల అక్కడి కోర్టులో ప్రవీణ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. త్వరలోనే  క్లే కౌంటీ కోర్టులో ప్రవీణ్‌ కేసు విచారణ జరగనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement