KBR Park: కేబీఆర్‌ పార్కు టికెట్టు ధర పెంపు

Hyderabad: KBR Park Entry Ticket Price Increased - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్‌ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్‌లైన్‌లో రెన్యూవల్‌ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్‌(జనరల్‌) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు.

అలాగే సీనియర్‌ సిటిజన్‌ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్‌ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది.

అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు  మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు.   

చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top