బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసులు నోటీసులు

Hyderabad: Hayat Nagar Police Issue Notices To Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బీజేపీ నాగోల్‌లో అమరుల యాదిలో అనే సభను నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కీట్‌ వ్యవహారంలో రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను హయత్‌ నగర్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఇక ఇదే విషయంలో నాలుగు రోజుల క్రితం జిట్టా బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు.
చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్‌ పిలిపించి యువకుడిపై యువతి దాడి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top