భార్య గొంతు కోసి హత్య | husband and wife incident | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసి హత్య

Jun 5 2026 7:45 AM | Updated on Jun 5 2026 11:07 AM

husband and wife incident

హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ భర్త.. భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండకు చెందిన షేక్‌ రహీం (32)తో సుమేరా బేగం (23)కు 2024లో వివాహం జరిగింది. వీరికి 20 నెలల కుమారుడు ఉన్నాడు.  కైత్లాపూర్‌లోని ఇందిరమ్మ కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. ఇటీవల దంపతుల మధ్యగొడవలు జరుగుతున్నాయి.   రెండు నెలల క్రితం ఏప్రిల్‌లో సుమేరా బేగం భర్తపై గృహహింస కేసు పెట్టింది. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికి  కౌన్సెలింగ్‌ ఇచ్చారు.   గురువారం ఉదయం భార్యా భర్తలు గొడవపడసాగారు. ఈ క్రమంలో  భర్త షేక్‌ రహీం కూరగాయల కత్తితో సుమేరా బేగం గొంతు కోశాడు. దీంతో ఆమె మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి భర్త షేక్‌ రహీంను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement