
సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు
యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.