హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం | Heavy Rains Lash Hyderabad, Hailstorm Hits Several Areas | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం

Mar 25 2026 5:00 PM | Updated on Mar 25 2026 5:00 PM

  Heavy Rains Lash Hyderabad, Hailstorm Hits Several Areas

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇవాళ వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో వడగళ్ల వాన పడింది. ఘట్‌కేసర్‌, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురిసింది.

రంగారెడ్డి జిల్లా, నారాయణపేట్‌, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌, మేడ‍్చల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement