నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటం చేస్తాం
సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆయిల్‌ఫెడ్ ఆ«దీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూ.500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తికి భూమి అప్పగించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ అ«దీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. అజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాలోని 3 ఎకరాల 23 గుంటల భూమి విషయంలో 1987లో సుప్రీంకోర్టు ప్రభుత్వ హక్కును స్పష్టం చేసిందని లేఖలో హరీశ్ పేర్కొన్నారు.
కోకాపేట, రాయదుర్గం, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల విషయంలో ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కారుచౌకగా ప్రైవేట్‌కు అప్పగించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.


