ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు | Harish Rao: Efforts to solve the problems of photojournalists | Sakshi
Sakshi News home page

ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు

Aug 21 2023 2:55 AM | Updated on Aug 21 2023 9:54 AM

Harish Rao: Efforts to solve the problems of photojournalists - Sakshi

మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న శ్రీకాంత్‌. చిత్రంలో అల్లం నారాయణ, కొప్పుల ఈశ్వర్, దేశపతి శ్రీనివాస్‌

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గతంలో పత్రికా ఫొటోగ్రాఫర్లకు ఫొటో జర్నలిస్టుగా అక్రిడిటేషన్‌ ఉండేదని, కానీ నేడు ఫొటోగ్రాఫర్‌గా మార్పు చేయడం వలన ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

     ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్‌రెడ్డి, ఠాకూర్‌
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణతో.. అవార్డులు అందుకున్న ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు శివప్రసాద్, యాకయ్య, వేణుగోపాల్, సతీశ్, శివకుమార్, భాస్కరాచారి, రాజే శ్‌రెడ్డి, ఠాకూర్‌ 

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. హరీశ్‌ మాట్లాడుతూ దినపత్రికల్లో వార్త పూర్తిగా చదవకపోయినప్పటికీ ఫొటోను చూసి సారాంశం గ్రహించవచ్చని చెప్పారు.


తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం కేటాయించిందని, త్వరలో జర్నలిస్టు భవనం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement