శారీరకంగా వాడుకొని మోసం చేశాడని.. | Girlfriend Protest Infront Of Boyfriend House In Bheemadevarapally | Sakshi
Sakshi News home page

శారీరకంగా వాడుకొని మోసం చేశాడని..

Published Sat, Dec 26 2020 11:50 AM | Last Updated on Sat, Dec 26 2020 1:20 PM

Girlfriend Protest Infront Of Boyfriend House In Bheemadevarapally - Sakshi

సాక్షి, భీమరదేవరపల్లి(వరంగల్‌): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్‌ అర్భన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునంద.. చంటయపల్లికి చెందిన కొన్నె రమేష్‌ మద్య నాలుగేళ్ల క్రితం రాంగ్‌ కాల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. చదవండి: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య

ఈ క్రమంలో రమేష్‌ ఆర్మీ జవాన్‌ కాగా సెలవుల్లో ఇంట్లికి వచ్చినపుడల్లా ఇరువురు కలుసుకునేవారు. అయితే తనను పెళ్లి చేసుకుంటాని నమ్మబలకడంతో దగ్గరయ్యానని బాధితురాలు తెలిపింది. ఇటీవల తన ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో రమేష్‌ ఇంటికికి వెళ్లగా వేరే అమ్మాయితే నిశ్చితార్థం జరిగినట్లు తెలిసిందని చెప్పింది. తనకు రమేష్‌తో వివాహం జరిపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్‌ ఎస్సై రాజ్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. యువతి మౌన పోరాటానికి మద్దతు తెలిపారు. చదవండి: రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement