ఏడాదిలో రూ.212 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు | Sakshi
Sakshi News home page

ఏడాదిలో రూ.212 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు

Published Thu, Apr 13 2023 4:20 AM

Fire department DG Nagireddy revealed on fire accidents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రమాదాల కారణంగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా రూ.212.36 కోట్ల విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతైనట్టు అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అదే ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. 2021, 2022లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అగ్నిప్రమాదాలు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం.. ఫైర్‌ సిబ్బంది కాపాడిన క్షతగాత్రులు, ఆస్తుల వివరాలను బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈనెల 14న ఫైర్‌ సర్వీసెస్‌ డేను పురస్కరించుకుని వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే కార్యక్రమాల్లో అగ్నిప్రమాదాల నుంచి బయటపడటమెలా అనే విషయమై అవగాహన కల్పించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.  
 

 
Advertisement
 
Advertisement